కొత్త దర్శకులతో అల్లు అర్జున్ సినిమాలు !

అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నాపేరు సూర్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ తరువాత కొత్త దర్శకులతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. అందుకే కొత్త దర్శకులు చెప్పే కథలు వింటున్నారట. అలా ఆయనకు కథలు వినిపించిన యువ దర్శకుల్లో సంతోష్ రెడ్డి కూడా ఒకరు.

అలాగే ప్రశాంత్ అనే మరో కొత్త దర్శకుడు కూడా అల్లు అర్జున్ కు ఒక పాయింట్ చెప్పాడని సమాచారం. మరి బన్నీ ఈ ఇద్దరు కొత్త దర్శకుల్లో ఎవరి సినిమా ముందు ప్రారంభిస్తాడో చూడాలి. ఇకపోతే ఈ హీరో నటిస్తోన్న ‘నాపేరు సూర్య’ సినిమాను లగడపాటి శ్రీధర్ ఈ మూవీని నిర్మిస్తుండగా అందులో అను ఇమ్మానుల్ హీరోయిన్ గా నటిస్తోంది.

 





Like us on Facebook