కొత్త లుక్ కోసం యూఎస్ వెళ్లనున్న అల్లు అర్జున్ !

కొత్త లుక్ కోసం యూఎస్ వెళ్లనున్న అల్లు అర్జున్ !

Published on Jul 26, 2017 12:06 PM IST


‘దువ్వాడ జగన్నాథమ్’ సక్సెస్ అనంతరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ పై అభిమానవుల్లో, సినీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతూ మొదటి ప్రాజెక్టుగా ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. దేశభక్తి నైపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో బన్నీ ఒక మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

సినిమాలోని కథను, పాత్ర స్వభావాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త లుక్ మార్చే అల్లు అర్జున్ ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా కనిపించేందుకు భారీ ప్లాన్ రెడీ చేసుకున్నాడు. అందులో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం నెల పాటు యూఎస్ వెళ్లి కఠినమైన శిక్షణ తీసుకోనున్నాడు. దీనికోసం ఈ వారాంతంలో ఆయన యూఎస్ బయలుదేరి వెళ్లనున్నారు. బన్నీ ట్రై చేయబోయే ఈ లుక్ మునెప్పన్నడూ చూడని విధంగా సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

2018 సంక్రాంతికి విడుదలకానున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం, ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ చేయనుండగా బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు