తీరిక లేకుండా కష్టపడుతున్న అల్లు అర్జున్ !
Published on Nov 9, 2017 8:59 am IST

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘నా పేరు సూర్య’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేశభక్తి నైపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రచయిత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఊటీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నవంబర్ 5 న హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది. చాలా రోజుల క్రితమే వచ్చే ఏడాది ఏప్రిల్ 27న సినిమా విడుదలవుతుందని ప్రకటించడంతో టీమ్ గ్యాప్ లేకుండా పనిచేస్తున్నారు.

ముఖ్యంగా బన్నీ అయితే మొదటి నుండి ఫిజికల్ మేకోవర్ కోసం అమెరికన్ ట్రైనర్స్ ను పెట్టుకుని మరీ కష్టపడి ఇప్పుడు తీరిక లేకుండా షూటింగ్లో పాల్గొంటున్నారు. గత ఊటీ షెడ్యూల్ కు, ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్ షెడ్యూల్ కు మధ్య ఆయన తీసుకుంది కేవలం ఒక్కరోజు సెలవు మాత్రమే. ఆ ఒక్క రోజును మినహాయిస్తే ఆయన గత 40 రోజులుగా నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం, ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ చేస్తుండగా బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook