అల్లు అర్జున్ సినిమాకు అదిరిపోయే టైటిల్..!

అల్లు అర్జున్ సినిమాకు అదిరిపోయే టైటిల్..!

Published on Aug 28, 2016 2:47 PM IST

dj-allu-arjun
‘సరైనోడు’ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని రేపు వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇక ఈ సినిమా టైటిల్‌ను కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా స్వయంగా వెల్లడించారు. అల్లు అర్జున్ ఇమేజ్‌కు సరిపడేలా ఉంటూనే, కొత్తగా ఉండేలా ఈ సినిమాకు ‘డీజే-దువ్వాడ జగన్నాథమ్’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు.

‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్, బన్నీ స్టైల్‌కి సరిపడేలా మంచి కమర్షియల్ కథను సిద్ధం చేశారట. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ పరంగా ఎప్పుడూ కొత్తదనం చూపించే హరీష్, బన్నీ కోసం డిజైన్ చేసిన పాత్ర కూడా అదిరిపోయేలా ఉందని, ఆ క్యారెక్టరైజేషన్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ టైటిల్‌ను ఖరారు చేసినట్లు టీమ్ తెలిపింది. రేపట్నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు