ఊటీ వెళ్తున్న అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా..!

ఊటీ వెళ్తున్న అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా..!

Published on Oct 2, 2014 1:00 AM IST

Trivikram-alluarjun

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా సెకండ్ షెడ్యూల్ ఊటీలో జరగనుందని సమాచారం.
దసరా పండుగ తర్వాత ఊటీలో ఈ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. కొన్ని రోజుల క్రితం ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. హీరో, హీరోయిన్ సమంతలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

‘జులాయి’ తర్వాత త్రివిక్రమ్, శ్రీనివాస్ కలసి చేస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరోసారి వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అల్లు అర్జున్ సమంత, అదా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎంపిక చేయవలసి ఉంది.

సీనియర్ హీరోయిన్ స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ‘జులాయి’ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు