రామలింగయ్యకు స్మరణీయంగా అల్లు వారి సినిమా స్టూడియో.!

రామలింగయ్యకు స్మరణీయంగా అల్లు వారి సినిమా స్టూడియో.!

Published on Oct 1, 2020 2:00 PM IST

మన టాలీవుడ్ లో కొంతమంది లెజెండరీ కమెడియన్స్ జాబితా తీస్తే వారికి ఆడుగురువులా లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ నుంచి మొదలైన అల్లు వారి ప్రస్థానం ఇప్పటి వరకు కొనసాగుతుంది. టాప్ నిర్మాతగా అల్లు అరవింద్, టాప్ హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు టాలీవుడ్ ను మరోస్థాయికి తీసుకెళ్లారు.

అయితే ఈరోజు ఆయన 99 వ జన్మదినం సందర్భంగా అల్లు వారి కుటుంబం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మన టాలీవుడ్ లో షూటింగ్స్ అంటే భారీ స్టూడియోస్ లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలా మన దగ్గర అన్నపూర్ణ స్టూడియో మరియు రామోజీ ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయి.

ఇపుడు అల్లు వారు కూడా హైదరాబాద్ లోని గండిపేట ప్రాంతంలో ఒక 10 ఎకరాలలో ముందుగా మొదలు పెట్టనున్నారు. ఈ స్టూడియో ను అల్లు అరవింద్ వారి తనయులు అల్లు బాబీ మరియు అల్లు అర్జున్ లు సహా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని తీసుకుని ఆయనకు గుర్తుగా లాంచ్ చేసారు. అలాగే ఈ స్టూడియో తాలూకా నిర్మాణాత్మక పనులు అతి తొందరలోనే మొదలు కానున్నాయి.

https://www.instagram.com/p/CFyy7WOD1K9/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు