‘కొత్త జంట’ పై ఆశలు పెట్టుకున్న అల్లు శిరీష్

‘కొత్త జంట’ పై ఆశలు పెట్టుకున్న అల్లు శిరీష్

Published on Apr 20, 2014 10:36 AM IST

Allu-Sirish-Kotha-Janta
అల్లు శిరీష్ ద్వితీయ ప్రయత్నంగా చేసిన ‘కొత్త జంట’తో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. తన మొదటి సినిమా ‘గౌరవం’ బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని సాధించకపోవడంతో ఈ సినిమా అల్లు శిరీష్ కి చాలా కీలకం కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని ఎంచుకున్న అల్లు శిరీష్ కి డైరెక్టర్ మారుతి మార్క్ తోడవడంతో కమర్షియల్ గా హిట్ అందుకుంటానని ఆశగా ఉన్నాడు.

ఈ సినిమాలో కూడా ఎప్పటిలానే మారుతి కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అల్లు శిరీష్ సరసన రేజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జెబి మ్యూజిక్ అందించాడు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మించాడు. అల్లు శిరీష్ ‘కొత్త జంట’ తో హిట్ అందుకుంటాడని మీరనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు