మలయాళ సినిమా ఆఫర్ అందుకున్న ‘అల్లు శిరీష్’

allu-sirish-in
ఈ శుక్రవారం 5వ తేదీ విడుదలవుతున్న సినిమాల్లో ‘ అల్లు శిరీష్’ నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం కూడా ఉంది. విడుదలైన ట్రైలర్లు, పాటలు సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. శిరీష్ కూడా తన మొదటి రెండు సినిమాలు అంతగా ప్రభావం చూపకపోవడంతో ఈ చిత్రం ద్వారానైనా సక్సెస్ సాధించాలని బాగానే కష్టపడ్డాడు. ఇదిలా ఉంటే శిరీష్ కు మలయాళ పరిశ్రమలోని ఓ టాప్ దర్శకుడి వద్ద నుండి సినిమా ఆఫర్ వచ్చిందట.

కానీ ఆ సినిమాకి ఓకే చెప్పాలా లేదా అనే ఆలోచనలో ఉన్నానని, ప్రస్తుతం మలయాళంలో కూడా తెలుగు సినిమాలకు ఆదరణ పెరిగిన నైపథ్యంలో ద్విభాషా సినిమాలు చేయడం మంచిదని అనుకుంటున్నానని ఆయనే స్వయంగా తెలిపారు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో సైతం తన సినిమాల్ని ప్రవేశపెట్టాలనే ప్లాన్లో ఉన్న శిరీష్ తన మలయాళ ప్రవేశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

Like us on Facebook