సిక్స్ ప్యాక్ తో ఆశ్చర్యపరిచిన అల్లు శిరీష్

సిక్స్ ప్యాక్ తో ఆశ్చర్యపరిచిన అల్లు శిరీష్

Published on May 23, 2015 6:07 PM IST

Allu-Siresh
టాలీవుడ్ హీరోలకు స్టార్ స్టేటస్ ఎంత ముఖ్యమో దాన్ని సంపాదించుకోవడానికి ఫీట్ గా వుండడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకున్నారు. దానికోసం ఆరుపలకల దేహాన్ని సంపాదించుకోవడం ట్రెండ్ గా మార్చుకున్నారు మన యువహీరోలు. ఇప్పుడు వారి జాబితాలోకి మెగా యువహీరో అల్లు శిరీష్ కూడా చేరారు.

అల్లు శిరీష్ హఠాత్తుగా ట్విట్టర్ లో తన సిక్స్ ప్యాక్ ఫోటోలు పెట్టేసిరికి అందరూ షాకయ్యారు. ఆ ఫోటోలలో అల్లు శిరీష్ పడ్డ కష్టం కనిపిస్తుంది. తన అన్న బన్నీ దేశముదురు సినిమానుండి ఫిట్ గా వుండడం తెలుసుకున్నానని తెలిపాడు. త్వరలో శిరీష్ నటించబోయే చిత్రానికి ఈ వర్కౌట్ ఉపయోగపడచ్చని అంచనా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు