చంచల్ గూడ జైలుకు వెళ్లిన అల్లు శిరీష్ !
Published on Jul 16, 2017 12:58 pm IST


మెగాహీరో అల్లు శిరీష్ ఈ ఏడాది ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెల 9వ తేదీన పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం హీరో అల్లు శిరీష్ ఈ సినిమా కోసం రెండు రోజులు చంచల్ గూడ జైలుకి వెళ్లారట.

అక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని, షూటింగ్ పూర్తై వెళ్లిపోతున్న సమయంలో అక్కడి జైలు అధికారులు రిక్వెస్ట్ మేరకు శిరీష్ జైల్లోని ఖైదీలకు చిన్నపాటి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శిరీష్ సరసన సురభి, శీరత్ కపూర్లు హీరోయిన్లుగా నటిస్తుండగా శ్రీనివాస్ అవసరాల ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

 
Like us on Facebook