విడుదలకు సిద్దమైన ‘అమ్మమ్మగారిల్లు’ టీజర్ !

విడుదలకు సిద్దమైన ‘అమ్మమ్మగారిల్లు’ టీజర్ !

Published on Apr 18, 2018 1:28 PM IST


యంగ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్ సూర్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మంచి స్పందన రాగా టీజర్ ను కూడ సిద్ధం చేశారు దర్శక నిర్మాతలు.

ఈ నెల 22న ఈ టీజర్ ను విడుదలచేయనున్నారు. ఉమ్మడి కుటుంబం, అందులోని రిలేషన్స్ నైపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వాజిత్ మూవీస్ బ్యానర్ పై కె.ఆర్ మరియు రాజేష్ లు సంయుక్తంగా నిర్మించారు. బేబి షామిలి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ రమణ సంగీతాన్ని అందించారు. ఇకపోతే గతంలో ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానెల్ జెమిని రూ.2.75 కోట్లకు కొనుగోలుచేయగా ఇప్పుడు ఆడియో హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్ మంచి ధరకు కైవసం చేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు