నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసిన అమీ జాక్సన్!

నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసిన అమీ జాక్సన్!

Published on Apr 18, 2015 3:40 PM IST

Amy-Jackson
శృతి హాసన్, సమంత, అనుష్క, తమన్నా, హన్సిక ఇలా పెద్ద పెద్ద స్టార్లందరినీ పక్కన పెట్టేసి అమీ జాక్సన్ మొదటి స్థానాన్ని కొట్టేసింది. ఏ కాంపిటీషన్‌లో అమీ వీరందరినీ ఓడించిందని అనుకుంటున్నారా? చెన్నైకి చెందిన సెలెబ్రిటీల్లో మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా అమీ జాక్సన్ ఎంపికైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్, వుమెన్ ర్యాంకులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుల్లో తమకు నచ్చిన సెలెబ్రిటీ ర్యాంకును చూసి అభిమానులు మురిసిపోవడం ప్రతిసారీ జరిగేదే!

2014 సంవత్సరానికి గానూ మోస్ట్ డిజరైబుల్ మెన్, వుమెన్ అవార్డుల కోసం దేశవ్యాప్తంగా ఒక ఓటింగ్, చెన్నై, కొచ్చి, హైద్రాబాద్ లాంటి నగరాలకు నాలుగు క్యాటగిరీలుగా అవార్డుల కోసం ఓటింగ్ జరిగింది. ఇందులో చెన్నైకి సంబధించి మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా ఇంగ్లీష్ భామ అమీ జాక్సన్ ఎంపికైంది. కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్లందరినీ వెనక్కి నెట్టేసి అమీ ఈ ర్యాంకును పొందింది. ‘మద్రాసీ పట్టణం’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్ ‘తాండవం’, ‘ఎవడు’ సినిమాల్లో మెరిసింది. తాజాగా ఆమె నటించిన ‘ఐ’ సినిమా తర్వాత యువకుల కలల రాణిగా మారిపోయింది. ‘ఐ’ సినిమా తర్వాత అమీ జాక్సన్ రేంజ్ ఏ మేర పెరిగిందన్నది తెలపడానికి ఈ విషయం చాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు