ఇంకొద్దిసేపట్లో తాప్సి హర్రర్ థ్రిల్లర్ ట్రైలర్ !

ఇంకొద్దిసేపట్లో తాప్సి హర్రర్ థ్రిల్లర్ ట్రైలర్ !

Published on Jul 19, 2017 3:51 PM IST


బాలావుడ్లో వరుస సక్సెస్లతో బాగా పాపులర్ అయిన నటి తాప్సి ప్రధాన పాత్రలో నటించిన తెలుగు చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. దెయ్యానికి మనుషులు భయపడటం అనే రొటీన్ ఫార్ములాకు భిన్నంగా మనుషులకు దెయ్యం భయపడటం అనే కొత్త పాయింట్ తో రూపొందిన ఈ సినిమా చిత్ర ప్రమోషన్ల వలన కొంత క్రేజ్ సంపాదించుకుంది. అంతేగాక ఇటీవల విడుదలైన టీజర్ కూడా బాగానే ఉండటంతో ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి ఏర్పడింది.

దీంతో చిత్ర యూనిట్ ట్రైలర్ ను కూడా సిద్ధం చేసి ఈరోజు సాయంత్రం విడుదల చేయనుంది. 70 ఎమ్ఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ మరియు శశి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని మహి.వి. రాఘవ డైరెక్ట్ చేయగా సీనియర్ కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్, రఘులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు