ట్విట్టర్ లో అనసూయ కౌంటర్లు..!

ట్విట్టర్ లో అనసూయ కౌంటర్లు..!

Published on Mar 23, 2020 10:14 AM IST

స్టార్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ సామజిక విషయాల పట్ల స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా సమకాలీన విషయాలపై తన గళం వినిపిస్తూ ఉంటారు. ఓ సంఘటనపై ఆమె స్పందించే తీరును, అభిప్రాయాలను కొందరు గౌరవిస్తే మరి కొందరు వ్యతిరేకిస్తూ ఉంటారు. ట్విట్టర్ లో ఆమె పోస్ట్స్ కి కొందరు ఇబ్బంది కరమైన కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు.

ఓ సంధర్భంలో కొన్ని వల్గర్ కామెంట్స్ పై ఆమె ట్విట్టర్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. వారు దాన్ని లైట్ తీసుకున్నారు. ఇక నేటి ఉదయం నుండి ఆమె వరుస ట్విట్టర్ పోస్ట్స్ తో వల్గర్ కామెంట్స్, వితండ వాదం చేసే వారిపై విరుచుకుపడ్డారు. వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ చేసి చేసి ఆమె చేతులు కూడా నొప్పి పుట్టాయట. ఆమెకు ఈ మధ్య సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువైపోయాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు