రవితేజ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న దర్శకుడు !

రవితేజ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న దర్శకుడు !

Published on Jan 18, 2017 10:38 PM IST

sai-karthik-anil-ravipudi
మాస్ మహారాజ రవితేజ దాదాపు సంవత్సరం గ్యాప్ తర్వాత సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. మార్చి నుండి మొదలవుతుందని చెప్పబడుతున్న ఈ చిత్రంతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ అందుకుని రవి తేజ ఖాతాలో కూడా హిట్ వేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడు. అందుకోసం తన సక్సెస్ సెంటిమెంటును కూడా ఫాలో అవుతున్నాడు.

అదేమిటంటే అనిల్ తన మొదటి రెండు చిత్రాలు ‘పటాస్, సుప్రీం’ లకు పని చేసిన సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ను రవి తేజ్ సినిమాకి కూడా రిపీట్ చేయనున్నాడట. సాయి కార్తీక్, అనిల్ కలయికలో వచ్చిన ‘పటాస్, సుప్రీం’ సినిమాలు మంచి కమర్షియల్ విజయాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే అనిల్ ఈసారి కూడా అలాంటి విజయమే అందుకోవాలని తన రాపోకి బాగా దగ్గరైన సాయి కార్తీక్ తోనే ఈ సినిమాకి మ్యూజిక్ చేయించాలని ఫిక్సయ్యాడట. అనుకున్న సమయానికి, దర్శకుడు కోరిన సంగీతం సులువుగా అందించే సాయి కార్తీక్ ఇప్పటిదాకా 50కు పైగా సినిమాలకు మ్యూజిక్ అందించి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు