హీరోలను ఇంకా ఫైనల్ చేయలేదంటున్న అనిల్ రావిపూడి !
Published on Nov 13, 2017 1:45 pm IST

ఇటీవలే రవితేజతో ‘రాజా ది గ్రేట్’ సినిమా చేసి మంచి కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తర్వాత సినిమా ఏమిటనే దానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నైపథ్యంలో ఆయన దిల్ రాజు నిర్మాణంలో ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే సినిమాను ప్రకటించారు. అంతేగాక ఈ చిత్రం మల్టీ స్టారర్ గా ఉంటుందని కూడా అన్నారు.

ఇక అప్పటి నుడ్ని ఈ సినిమాలో మొదటి హీరోగా విక్టరీ వెంకటేష్ నటిస్తారని, రెండవ హీరోగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేయనున్నారని వార్తలొచ్చాయి. దీంతో ప్రేక్షకులు కొంత కన్ఫ్యూజన్ కు గురయ్యారు. ఇక లాభం లేదనుకున్న అనిల్ రవాయిపూడి తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఇంకా తన సినిమాలో హీరోలను కన్ఫర్మ్ చేయలేదని, ఒకసారి చేశాక తానే స్వయంగా ప్రకటిస్తానని అన్నారు. మరి ఆయన ఆలోచనల్లో ఏయే హీరోలున్నారో తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడక తప్పదు.

 
Like us on Facebook