పవన్ సినిమా హిట్టైతే సంవత్సరానికి ఒక సినిమా చేస్తా – అనిరుద్
Published on Jul 13, 2017 9:08 am IST


పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న సంగతి తెల్సిందే. దర్శకుడు త్రివిక్రమ్ పట్టుబట్టి మరీ అనిరుద్ చేత ఈ సినిమాకి సంగీతం చేయిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడిన అనిరుద్ ఒక్క పాట మినహా అన్ని పాటలు పూర్తయ్యాయని అన్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ చేత ఒక పాట పాడించాలని అనుకుంటున్నాం. అది గనుక వర్కవుటై సినిమా హిట్టయితే ఇకపై తెలుగులో సంవత్సరానికి కనీసం ఒక సినిమా అయినా చేయడానికి ప్రయత్నిస్తాను అన్నారు. ఈ నెల 19న చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్ కోసం యూరప్ వెళ్లనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు.

 
Like us on Facebook