ఎన్టీఆర్ సినిమాకు యంగ్ సెన్సేషన్ మ్యూజిక్!

ఎన్టీఆర్ సినిమాకు యంగ్ సెన్సేషన్ మ్యూజిక్!

Published on Dec 11, 2016 4:29 PM IST

Anirudh-Ravichander
‘జనతా గ్యారేజ్’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా ఏమై ఉంటుందా అని మూడు నెలలుగా ఎదురుచూస్తూ వచ్చిన అభిమానులకు ఈమధ్యే సమాధానం దొరికిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సంక్రాంతి తర్వాత సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక ఈ సినిమా అనౌన్స్ అయిన రోజునుంచే సంగీత దర్శకుడిగా ఎవరు పనిచేస్తారన్న ప్రచారం బాగా వినిపిస్తోంది.

తాజాగా తమిళ సినీ పరిశ్రమలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరున్న అనిరుధ్, ఎన్టీఆర్ సినిమాకు పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలాసార్లు తెలుగులో పనిచేయాలని భావించినా, అనిరుధ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈమధ్యే పవన్-త్రివిక్రమ్‍ల కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాకు అనిరుధ్ ఖరారు కాగా, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు ఖరారైనట్లు వార్తలు వస్తూండడం విశేషంగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్‌ను ఓ సరికొత్త కోణంలో చూపించనున్న ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు