“వకీల్ సాబ్”నుంచి మరో చార్ట్ బస్టర్.!

“వకీల్ సాబ్”నుంచి మరో చార్ట్ బస్టర్.!

Published on Mar 7, 2021 12:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. పవన్ కం బ్యాక్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు సెట్టయ్యాయి. మరి దీనితో పాటుగా ఈ చిత్రంకు ప్రమోషన్స్ లో భాగంగా ఈ మార్చ్ నేలను మ్యూజికల్ మార్చ్ గా మార్చేశారు.

ఇప్పటికే ఈ సినిమా సెకండ్ సింగిల్ “సత్యమేవ జయతే”కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే దీనికి ముందు వచ్చిన మగువా మగువ కూడా బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు హ్యాట్రిక్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్టుగా సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి అంటున్నారు.

హ్యాట్రిక్ లెక్కల్లో ఉంది రాస్కోరా సాంబా అంటూ పవన్ మార్క్ డైలాగ్స్ సాంగ్ పై హింటిచ్చారు. ఈసారి మెలోడీ టచ్ తో వీరు వస్తున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా థమన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన ఈ సాంగ్ మరో వారంలో రానున్నట్టుగా తెలిపారు. మరి ఇంత కాన్ఫిడెన్స్ గా చెబుతున్న ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు