స్టార్ హీరో సినిమాలో ఇలియానా.. నిజమేనా ?

స్టార్ హీరో సినిమాలో ఇలియానా.. నిజమేనా ?

Published on Dec 16, 2019 7:27 PM IST

దక్షిణది స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ షూటింగ్లో ఉన్నారు. ఇటీవలే ఈ చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. అజిత్ గత చిత్రం ‘నెర్కొండ పారవై’ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా యామీ గౌతమ్ నటించనుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇందులో ఇంకో హీరోయిన్ పాత్ర కూడా ఉందట.

ఆ పాత్ర కొసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాను తీసుకోవాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అయినా తమిళంలో పెద్దగా సినిమాలు చేయలేదు ఇలియానా. అయినా ఆమెను తీసుకోవాలనే ఆలోచన ‘వాలిమై’ బృందానికి రావడం విశేషమే. ఇక సౌత్ ఇండస్ట్రీ నుండి ఆఫర్లు కొరవడిన తరుణంలో ఇలియానాకు అజిత్ సినిమా నుండి పిలుపు రావడం ఆమెకు దొరికిన గోల్డెన్ ఛాన్స్ అనొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు