మరో రికార్డును ఖాతాలో వేసుకున్న రజనీకాంత్ !

మరో రికార్డును ఖాతాలో వేసుకున్న రజనీకాంత్ !

Published on Dec 7, 2016 8:56 PM IST

kabali
సూపర్ స్టార్ రజనీకాంత్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. అది కూడా జూలైలో విడుదలైన ‘కబాలి’ సినిమాతో. ఇంతకీ ఏమిటా రికార్డ్ అనుకుంటున్నారా. అదే టాప్ ట్రెండింగ్ మూవీ ట్రైలర్ ఇన్ యూ ట్యూబ్. యూ ట్యూబ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ 2016 వ సంవత్సరానికి గాను యూ ట్యూబ్ లో అత్యధికంగా ట్రెండ్ అయిన ట్రైలర్లలో ‘కబాలి’ ట్రైలర్ మొదటి స్థానంలో ఉంది. దాని తరువాత కపిల్ శర్మ, సల్మాన్ ఖాన్ ల కామెడీ షో ఉంది.

దేశ వ్యాప్తంగా రిలీజైన చిత్రాలన్నింటిలో రజనీ ‘కబాలి’ సినిమాకే అంతటి క్రేజ్ దక్కడానికి కారణం రజనీ చరీష్మ, సినిమా ప్రమోషన్లే అని చెప్పాలి. సినిమా అంతంత మాత్రంగానే ఉన్నా మొదట్లో విడుదలైన ఈ ట్రైలర్ మాత్రం న భూతో అనే రీతిలో అద్భుతంగా ఉంది. దీనికి తోడు రజని స్టైల్, నిర్మాణ సంస్థ కోట్లు ఖర్చు పెట్టి మరీ విమానాలపై ప్రమోషన్లు చేయడం వంటి వాటి వలన సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. చెప్పాలంటే ఒక దశలో దేశమంతా ‘కబాలి’ మేనియాతో ఊగిపోయింది. అందుకే ఈ సినిమాకి ఈ యూ ట్యూబ్ రికార్డ్ దక్కింది. రజనీ రేంజ్ కి ఇది చిన్నదే అయినా ఆయన అభిమానులకు మాత్రం పెద్దదే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు