‘సైరా’ టీమ్ లో చేరనున్న మరొక ప్రముఖ నటుడు !

మెగాస్టార్ చిరంజీవి 151వ వ సినిమా ‘సైరా’ శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని జరుపుకుంటోంది. డిసెంబర్ 6 నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు రూ.150 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జాతీయస్థాయి సినిమాగా మలచేందుకు నిర్మాత రామ్ చరణ్ గట్టిగా కృషి చేస్తున్నారు.

అందుకోసం ఇప్పటికే అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార వంటి నటుల్ని ప్రాజెక్టులోకి తీసుకోగా ఇప్పుడు ఈ స్టార్ టీమ్ లు మరొక పాపులర్ నటుడు జతకానున్నాడు. ఆయనే భోజ్ పురి పాపులర్ నటుడు రవికిషన్. ఆయన్ను తెలుగులో ‘రేసుగుర్రం’ సినిమా ద్వారా లాంచ్ చేసిన సురేందర్ రెడ్డి ‘సైరా’ లో నటించమని అడగ్గానే రవికిషన్ వెంటనే ఓకే చెప్పారని, చిరుటి కలిసి నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది.

 

Like us on Facebook