విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమంటున్న స్టార్ హీరో !
Published on Nov 5, 2017 2:03 pm IST

ఈ మధ్యన యంగ్, సీనియర్ హీరోలు కేవలం కథానాయకుల పాత్రకే పరిమితం కాకుండా కథ బాగుంది, పాత్రలో దమ్ముంటే ప్రతినాయకుడి పాత్రల్ని చేయడానికి ఏమాత్రం వెనుకాడటంలేదు. ఇప్పటికే యంగ్ హీరోల్లో ఆది పినిశెట్టి ఇదే ఫార్ములాను ఫాలో అవుతుండగా సీనియర్ హీరోల్లో జగపతిబాబు మంచి విజయాలను అందుకున్నారు. దీంతో కొద్దిరోజుల క్రితమే మరొక సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ పాత్రలో ఓకే చెప్పగా ఇప్పుడు మరొక స్టార హీరో కూడా నెగెటివ్ పాత్రలకి గ్రీన్ సిగ్నల్ వేశారు.

ఆయనే విశాల్. ఇటీవలే మోహన్ లాల్ మలయాళ చిత్రం ‘విలన్’ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ఆయన తెలుగులో సైతం అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి స్దిద్దంగా ఉన్నట్టు చెప్పారు. కథ మంచిదై పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటే రెమ్యునరేషన్, స్టార్ డమ్ వంటి అంశాల్ని పక్కనబెట్టి నటిస్తానని అన్నారు. మరిక మన రచయితలు ఆయనక్కూడా పాత్రలు రాయడం మొదలుపెట్టొచ్చన్నమాట. ఇకపోతే విశాల్ నటించిన ‘తుప్పరివాలన్’ తెలుగులో ‘డిటెక్టివ్’ తో ఈ నెల 10న రిలీజ్ కానుంది.

 
Like us on Facebook