మరో సినిమాతో వచ్చేస్తున్న సూపర్ స్టార్ !

మరో సినిమాతో వచ్చేస్తున్న సూపర్ స్టార్ !

Published on Dec 3, 2016 9:55 AM IST

mohanlal
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సంవత్సరం తెలుగులో బాగానే సందడి చేశాడు. ఇప్పటికే ఆయన నటించిన మూడు సినిమాలు ‘జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి’ విడుదల కాగా మరొక చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం ఏఎన్నార్, బాలకృష్ణల ‘గాడీవం’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన ఆయన మళ్ళీ ఈ 2106 లోనే తెలుగు ప్రేక్షకులకు దర్శనమిచ్చాడు. తెలుగు వాళ్ళు కూడా ఆయన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు. ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో ఆయన పాత్రకు మంచి ఆదరణ దక్కగా ఆయన సోలోగా చేసిన ‘మనమంతా’, నిన్న విడుదలైన ‘మన్యం పులి’ చిత్రాలు మంచి సినిమాలనే టాక్ తెచ్చుకున్నాయి.

ఈ పాజిటివ్ టాక్ తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మలయాళంలో ఘన విజయం సాధించిన ఆయన సినిమాలను తెలుగులోకి అనువదించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ ఆసక్తితోనే ఆయన తాజా చిత్రం ‘ఒప్పం’ ను తెలుగులోకి ‘కనుపాప’ పేరుతొ రిలీజ్ చేయనున్నారు. ఒక పాప, చూపులేని వ్యక్తి, ఒక హత్య కేసు వంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని డిసెంబర్ 30న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మంచి సినిమాలను అందిస్తూ గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ లాల్ ఈ చిత్రంతో తెలుగువాళ్లకు మరింత దగ్గరయ్యే అవకాశముంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు