పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన వ్యక్తి అంటున్న హీరోయిన్ !
Published on Jan 9, 2018 9:58 am IST

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం రేపు భారీ క్రేజ్ నడుమ అట్టహాసంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన అను ఇమ్మాన్యుయేల్ కు ఇదే మొదటి అతిపెద్ద చిత్రం కావడంతో దీనిపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారామె. ఈ చిత్రం గనుక ఘన విజయాన్ని అందుకుంటే ఆమె స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోవడం ఖాయం.

ఇక తన కో స్టార్ పవన్ గురించి మాట్లాడిన ఆమె ఆయనొక ప్రత్యేక వ్యక్తి అని, ఎంతో క్రేజ్ ఉన్నా చాలా సాధారణంగా ఉంటారని, షూట్ లేకపోతె స్టేట్స్ లో రిలాక్స్డ్ గా ఉంటారని, ఆయనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువని, ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుందని అన్నారు. ఈమెతో పాటు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంలో నటించారు.

 
Like us on Facebook