పవన్ ని చూడగానే డైలాగ్స్ కూడా మర్చిపోయానంటున్న హీరోయిన్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో రూపొందుతున్న చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్ కాబట్టి అందరూ కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసిన అను ఇమ్మాన్యుయేల్ కు పవన్, త్రివిక్రమ్ లు అవకాశమివ్వడం పట్ల ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఆమె దశ తిరిగినట్లే అనుకున్నారు.

అను ఇమ్మాన్యుయేల్ కూడా పవన్ సరసన నటించడం అదృష్టంగా భావిస్తున్నానంటూ పవన్ తో మొదటి రోజు కలిసి నటించడం భయమేసిందని చెప్పుకొచ్చారు. అలాగే పవన్ తో మొదటి రొమాంటిక్ సీన్ తనపైనే షూట్ చేశారని, ఒకటికి మూడుసార్లు చదువుకున్న డైలాగ్స్ కూడా పవన్ ముఖం చూడగానే కంగారు వలన మర్చిపోయేదాన్నని తన అనుభవాల్ని వివరించారు. ప్రస్తుతం యూరప్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

 

Like us on Facebook