తెలుగు స్టార్ హీరోయిన్ల జాబితాలో టాప్ స్థానం కోసం పోటీపడుతున్న వారిలో అను ఇమ్మాన్యుయేల్ కూడా ఒకరు. ఈ ఏడాది ఆరంభం వరకు ఆమె చేతిలో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘అజ్ఞాతవాసి’ సినిమా ఉండంతో ఇకపై హవా మొత్తం ఆమెదే అని అంతా అనుకున్నారు. అను కూడా ఆ సినిమాపై బోలెడు ఎన్నో అంచనాలు పెట్టుకుంది. కానీ అనూహ్య రీతిలో సినిమా బాక్సాఫీస్ ముందు భారీ పరాజయాన్ని మూటగట్టుకోవడం ఆమె ఆశలన్నీ గల్లంతయ్యాయి. చాలా మంది ఆమె పాత్ర, నటన పై కూడా పెదవి విరిచారు.
దీంతో ఆమె నెక్స్ట్ హోప్ అల్లు అర్జున్ తో చేస్తున్న ‘నా పేరు సూర్య’ చిత్రమే. ఈ చిత్రమైన విజమైనా మంచి విజయాన్ని సాధిస్తే ఆమె కెరీర్ ఊపందుకుని, స్టార్ హీరోయిన్ల జాబితాలో స్థానం దక్కించుకుంటుంది. మరి బన్నీ సినిమా ఆమెకు ఎలాంటి రిజల్టును ఇస్తుందో చూడాలి. వక్కంతం వంశీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది.
- ఓన్లీ యాక్షన్ అంటున్న ఎన్టీఆర్ !
- ‘భరత్ అనే నేను’లో కొత్త సన్నివేశాలు !
- షూటింగ్ ముగించుకున్న సుధీర్ బాబు సినిమా !
- ‘మహానటి’ సావిత్రిలోని మానవీయ కోణాన్ని ఆవిషరిస్తుందట !
- శరవేగంగా ఎన్టీఆర్ సినిమా పాటల రికార్డింగ్ !
సంబంధిత సమాచారం :
