గెస్ట్ రోల్ చేయనున్న అను ఇమ్మాన్యుయేల్ !

గెస్ట్ రోల్ చేయనున్న అను ఇమ్మాన్యుయేల్ !

Published on May 24, 2018 5:01 PM IST

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం నాగ చైతన్య, మారుతిల ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో నటిస్తున్న ఈమె రవితేజ, శ్రీను వైట్లల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కూడ నటించాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరనందు వలన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారామె.

తాజా సమాచారం మేరకు యువ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కలయికలో రూపొందుతున్న సినిమాలో అను చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. కథలోని చిన్నపాటి రోల్ కోసం ఎవరైనా తెలిసిన హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన మేకర్స్ అను ఇమ్మాన్యుయేల్ ను సినిమాలోకి తీసుకున్నారట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు