‘కిల్లర్’గా మంచు విష్ణు ‘అనుక్షణం’ డబ్బింగ్..!

‘కిల్లర్’గా మంచు విష్ణు ‘అనుక్షణం’ డబ్బింగ్..!

Published on Sep 1, 2014 4:30 PM IST

anukshanam
మంచు విష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమా ‘అనుక్షణం’. సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. మలయాళంలో ‘కిల్లర్’ పేరుతో ఈ సినిమాను అనువదిస్తున్నారు. మలయాళంలో కూడా సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నట్టు దర్శకుడు వర్మ ప్రకటించారు. నవదీప్, తేజస్వి, మధుశాలిని, రేవతి, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

సైకో కిల్లర్ కధాంశంతో ‘అనుక్షణం’ సినిమాను రూపొందించాం. ఈ సినిమా యూనివర్సల్ అప్పీల్ తో తెరకెక్కింది. థియేటర్లో ప్రతి ప్రేక్షకుడు మంచు విష్ణు క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు. సినిమాలో ఒక్కో అమ్మాయి చంపబడిన తర్వాత విష్ణు ఆ కేసును చేదించే క్రమం, సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతాయి. అని వర్మ అన్నారు. తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఒకే రోజున(సెప్టెంబర్ 12) విడుదల చేస్తున్నాం అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు