బాహుబలి పార్ట్ 1లో అనుష్క లేనట్టేనా?

బాహుబలి పార్ట్ 1లో అనుష్క లేనట్టేనా?

Published on Jan 30, 2015 12:09 AM IST

anushka1 (1)
తాజా సమాచారం ప్రకారం బాహుబలి రెండవ భాగంలో మాత్రమే అనుష్క పాత్ర వుంటుందట. ఈ ద్వితీయ భాగం బాహుబలి పార్ట్ 1 విడుదలైన కొన్ని నెలల తరువాత విడుదలవుతుంది. ఈ సమాచారంతో బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా విడుదలచేయనున్నారు అనే గాలివార్తకు తెరపడినట్టే.

ఈ చిత్ర మొదటిభాగానికి షూటింగ్ ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రధారులు. రాజమౌళి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఆర్కా మీడియా సంస్థ నిర్మాత. కీరవాణి సంగీత దర్శకుడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు