9 వసంతాలు పూర్తి చేసుకున్న అనుష్క

9 వసంతాలు పూర్తి చేసుకున్న అనుష్క

Published on Jul 22, 2014 1:00 PM IST

anushka

ఒక్క ‘అరుంధతి’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చెయ్యడమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే మొదటగా తన పేరే గుర్తొచ్చేలా చేసుకున్న హీరోయిన్ అనుష్క. నేటితో అనుష్క తెలుగు చిత్ర సీమకి పరిచయమై 9 వసంతాలు పూర్తి చేసుకుంది. అనుష్క హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ‘సూపర్’ 2005 జూలై 21న రిలీజ్ అయ్యింది.

ఈ 9 సంవత్సరాల కెరీర్ లో అనుష్క మొత్తం 29 సినిమాల్లో నటించింది. అందులో 20 తెలుగు సినిమాలు ఉంటే, 9 తమిళ సినిమాలు ఉన్నాయి. అనుష్కకి మొదటి సూపర్ హిట్ ‘విక్రమార్కుడు’ రూపంలో వస్తే తన కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం మాత్రం 2009లో వచ్చిన ‘అరుంధతి’. అనుష్క కేవలం సినిమాల్లోనే కాకుండా అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ మరియు అతిధి పాత్రల్లో కూడా కనిపించింది.

ప్రస్తుతం తెలుగు తమిళంలో స్టార్ హీరోయిన్ గా పేరున్న అనుష్క రెండు ఇండస్ట్రీల్లోనూ 4 క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి మరియు గుణశేఖర్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీస్ ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘లింగా’, మరో స్టార్ హీరో అజిత్ సరసన ఓ సినిమా చేస్తోంది.

2005లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమై, తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తూ స్టార్ హీరోయిన్ గా 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్యూటిఫుల్ అనుష్కకి 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు