నాదేం లేదు, అంతా దర్శకుల చలవే అంటున్న స్వీటి

నాదేం లేదు, అంతా దర్శకుల చలవే అంటున్న స్వీటి

Published on May 25, 2015 8:31 AM IST

anushka
సౌత్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ లిస్టులో ఒకరుగా వెలుగొందుతూ, అందరు టాప్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా, టాప్ హీరోలకి సమానంగా భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న హీరోయిన్ మన స్వీటి అలియాస్ మన యోగ బ్యూటీ అనుష్క. సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమా చెయ్యాలి అంటే దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న హీరోయిన్ అనుష్క అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఎంతో మంది నూతన కథానాయికలకి స్పూర్తిగా నిలుస్తున్న అనుష్కని ఎంతో బరువైన, నటనకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో అంతలా ఎలా ఒదిగిపోగలరు అని అనుష్కని అడిగితే అందులో నాదేమీ లేదు అంతా దర్శకుల చలవే అంటోంది మన స్వీటి.

అనుష్క మాట్లాడుతూ ‘నేనెప్పుడూ కథని కథగానే చూస్తాను. అది హీరో ఓరియెంటెడ్ లేదా లేడీ ఓరియెంటెడ్ అనేది చూడను. దర్శకుడు కథ రాసే టైంలోనే నటీనటులకు సంబందించిన వర్క్ సగం పూర్తవుతుంది. సెట్స్ కి వెళ్ళాక వారి ఆలోచనలకు తగ్గట్టు ఒదిగిపోవాలి. నేను అదే పనిని ఇంకాస్త శ్రద్దగా చేస్తాను. నటన విషయంలో నా గొప్పతనం ఏమీ లేదు, అంతా దర్శకుల చలవే’ అని అంటోంది. అనుష్క ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు