రుద్రమదేవి కోసం అనుష్క హై రేంజ్ ప్రమోషన్స్

రుద్రమదేవి కోసం అనుష్క హై రేంజ్ ప్రమోషన్స్

Published on Oct 5, 2015 7:30 PM IST

rudhramadevi-(1)
‘బాహుబలి’ లాంటి సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ తర్వాత వస్తున్నా మరో భారీ బడ్జెట్ పీరియడ్ హిస్టారికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ కోసం 9 ఏళ్ళు పాటు క్షుణ్ణంగా పరిశోధించి గుణశేఖర్ ఈ సినిమా తీసాడు. ఇండియన్ ఫస్ట్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీగా వస్తున్న ‘రుద్రమదేవి’ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 9న భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ కి కేవలం 3 రోజుల టైం మాత్రమే ఉంది. దాంతో ఈ చిత్ర టీం ప్రమోషన్స్ ని స్పీడ్ పెంచారు. నిన్ననే ఈ చిత్ర టీం ఒక స్పెషల్ ప్రెస్ మీట్ చెప్పి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అందులో బాగంగా అనుష్క రుద్రమదేవిని హై రేంజ్ లో ప్రమోట్ చేస్తోంది. ప్రస్తుతం వరుసగా అన్ని టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ మధ్య మధ్యలో డైలీ పేపర్స్ కి కూడా స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తోంది. అనుష్కనే ఈ సినిమాకి మెయిన్ లీడ్ కావడం వలన ప్రమోషన్స్ లో కూడా జోరుగా పాల్గొంటోంది. తెలుగు వెర్షన్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం మరో స్పెషల్ అట్రాక్షన్.

రుద్రమదేవి కథలో కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రానా, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు