‘సాహో’ సినిమాలో హీరోయిన్ గా అనుష్క ?
Published on Jul 5, 2017 4:29 pm IST


ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ సుజీత్ సింగ్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తితో అభిమానులు, సినీ జనం ఉండటంతో సినిమాపై భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇందులో ప్రభాస్ కు జోడీగా ఎవరు నటిస్తారనేది కూడా కొన్నాళ్లుగా అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. గతంలో పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించగా ఇప్పుడు అనుష్క పేరు తెర మీదికొచ్చింది.

దక్షిణాది సినీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు చివరకు అనుష్క అయితేనే బెస్ట్ అని ఆమెకు ఫిక్సయ్యారట. ఒకవేళ ఇదే గనుక వంద శాతం నిజమైతే సినిమా స్థాయి డబుల్ కావడం ఖాయం. తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా రూపొందుతున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

 
Like us on Facebook