యాక్షన్ హీరో సరసన అనుష్క ?

యాక్షన్ హీరో సరసన అనుష్క ?

Published on Jun 1, 2020 4:50 PM IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న సినిమా కోసం తేజ ఓ వైవిధ్యమైన నేపథ్యంతో విభిన్నమైన కథని రాశాడట. అయితే ఇంతకీ అలిమేలు మంగ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ? ఇప్పటికే హీరోయిన్ కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని తేజ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కాజల్‌, అనుష్క ఇద్దరిలో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోవాలని వాళ్ళు అయితేనే పాత్రకు న్యాయం జరుగుతుందని తేజ ఫీల్ అవుతున్నాడట. మరి ఈ సినిమా చిత్రీకరణలు మొదలయ్యే నాటికి కాజల్, అనుష్క ఖాళీగా ఉండాలి. బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి ఉండాలి.

ప్రస్తుతం కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ సినిమా కూడా ఉంది. మరి కాజల్ కష్టమే. మరి ఆ లెక్కన అలిమేలు మంగగా అనుష్క నటించే అవకాశమే ఎక్కువ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు