స్టార్ హీరోస్ రికార్డ్ బ్రేక్ చేస్తున్న అనుష్క ‘సైజ్ జీరో’

స్టార్ హీరోస్ రికార్డ్ బ్రేక్ చేస్తున్న అనుష్క ‘సైజ్ జీరో’

Published on Nov 24, 2015 1:01 PM IST

size-zero3
‘అరుంధతి’ సినిమా యోగ బ్యూటీ అనుష్క కెరీర్లో ది బెస్ట్ గా నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటే ఆ తర్వాతి రెండు స్థానాలను ఈ ఏడాది వచ్చిన భారీ బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్స్ ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’లు సొంతం చేసుకుంటాయి. ఈ రెండు సినిమాలలో అనుష్క కత్తి యుద్దాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమాల తర్వాత ఈ సారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడానికి అనుష్క ‘సైజ్ జీరో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమా నవంబర్ 27న వరల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

బాహుబలి, రుద్రమదేవి సినిమాలతో అనుష్కకి స్టార్ హీరోస్ రేంజ్ మార్కెట్ ఉందని నిరూపించుకుంది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి స్టార్స్ హీరోస్ రేంజ్ లో ఓపెనింగ్స్ సాధించిన లేడీ సూపర్ స్టార్ గా రికార్డ్ సాధించింది. మామూలుగా ఒక స్టార్ హీరో సినిమా అయితేనే తెలుగు తమిళ భాషల్లో కలుపుకొని ఓవరాల్ గా 1300-1500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. కానీ అనుష్క ఇప్పుడు ఆ రికార్డ్ ని తన సైజ్ జీరోతో బ్రేక్ చేయనుంది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1500 కంటే ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. ఈ వైడ్ రిలీజ్ కి తగ్గట్టుగానే సైజ్ జీరో టీం కూడా భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో స్టార్స్ అయిన నాగార్జున, రానా రాగ్గుబాటి, రంగం ఫేం జీవ, తమన్నా, కాజల్ అగర్వాల్, హన్సిక, లక్ష్మీ మంచు, శ్రీ దివ్య, రేవతిలు అతిధి పాత్రల్లో కనిపించి కనువిందు చేయనున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు