తమిళ చిత్రంలో అనుష్క సొంత డబ్బింగ్?

తమిళ చిత్రంలో అనుష్క సొంత డబ్బింగ్?

Published on Apr 19, 2014 9:17 AM IST

anushkaphoto
గౌతం మీనన్ దర్శకత్వంలో అజిత్ సరసన రానున్న ఎంటర్టైనర్ లో అనుష్క నటించడానికి సర్వం సిద్దమయింది. వీరి కలయికలో అనుష్క మొదటిసారిగా నటిస్తుంది గనుక ఈ ఏడాది తమిళ సినిమా రంగం తనకు ప్రత్యేకం అని ఈ భామ భావన

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు అనుష్క డబ్బింగ్ చెప్పుకోనుందట. దీనికోసం చాలా కష్టపడి తమిళం నేర్చుకుంటుందట. కానీ తన సినిమాలలో హీరోయిన్స్ కి హస్కీ వాయస్ ని ఇచ్చే గౌతం మీనన్ ఇంకా తన అభిప్రాయానికి పచ్చ జండా ఉపలేదని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ఒక యాక్షన్ సన్నివేశాన్ని తీసారు. హారీస్ జయరాజ్ సంగీతదర్శకుడు

ఈ సినిమానే కాక రవికుమార్ దర్శకత్వంలో రజినికాంత్ సరసన మరోసినిమాలో అనుష్క నటించనుంది. ప్రస్తుతం తెలుగులో ఈ భామ చేతిలో బాహుబలి, రుద్రమదేవి సినిమాలు వున్నాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు