‘సైజ్ జీరో’ కోసం అనుష్క వినూత్న ప్రచారం!

‘సైజ్ జీరో’ కోసం అనుష్క వినూత్న ప్రచారం!

Published on Nov 26, 2015 10:43 PM IST

size-zero
‘సైజ్ జీరో’.. ఆర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రేపు (నవంబర్ 27న) విడుదల కానున్న సినిమా. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మించింది. ఈ సినిమా కోసం 15కేజీలకు పైనే బరువు పెరిగి అనుష్క చేసిన సాహసం ‘సైజ్ జీరో’కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక అందుకు తగ్గట్లుగానే సైజ్ జీరో టీమ్ చేపట్టిన ప్రమోషన్స్‌ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేకంగా ఓ లెటర్ రాయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ లెటర్‌లో ఆమె సినిమా గురించి మాట్లాడుతూ సైజ్ జీరోలో తల్లి-కూతుళ్ళ సెంటిమెంట్‌తో పాటు ప్రతి ఒక్క ఎమోషన్ చాలా బాగుంటుందని, ఈ సినిమా కోసం బరువు పెరిగి మరీ నటించానని, కచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ఇక అనుష్క ఇలా ఓ లెటర్ రాసి అభిమానులకు సినిమా గురించి చెప్పడం ఓ కొత్త ప్రయత్నంగానే చూడవచ్చు. ఇప్పటికే ప్రమోషన్స్‌తో కొత్త పుంతలు తొక్కిన సైజ్ జీరో టీమ్ రిలీజ్‌కి ముందురోజు కూడా వినూత్న ప్రచారం చేపట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు.

wall1

సంబంధిత సమాచారం

తాజా వార్తలు