రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘భాగమతి’ !

అనుష్క నటించిన తాజా చిత్రం ‘భాగమతి’ ఫస్ట్ లుక్ కొద్దిరోజుల క్రితమే విడుదలై మంచి స్పందను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం, గతంలో అనుష్క ‘అరుంథతి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను చేసి ఉండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే దాదాపు అన్ని పనుల్ని పూర్తి చేసుకోవడంతో ముందుగా వచ్చిన వార్తల ప్రకారమే వచ్చే ఏడాది జనవరి ఆఖరికి సినిమాను విడుదుల చేయాలని నిర్ణయించారు నిర్మాతలు. జనవరి 26ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని సమాకూరుస్తున్నారు.

 

Like us on Facebook