‘ఐ’కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలుపెట్టిన ఎఆర్ రెహమాన్

‘ఐ’కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలుపెట్టిన ఎఆర్ రెహమాన్

Published on Oct 19, 2014 2:54 PM IST

Ar-rahman
సూపర్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఐ’. ఈ మూవీ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచీ ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కార్యక్రమాలను ఇటీవలే ఎఆర్ రెహమాన్ మొదలు పెట్టాడు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు.

ముందుగా ఈ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వలన వాయిదా వేసారు. ఐ’ చిత్ర టీం టెక్నికల్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసి నవంబర్ 21 లేదా నవంబర్ 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు డేట్స్ ని పరిశీలిస్తున్న టీం ఈ రెండింటిలో ఒక తేదీని త్వరలో లాక్ చేయనున్నారని సమాచారం.

విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న ఈ మూవీలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించగా ఉపేన్ పటేల్ విలన్ గా కనిపించనున్నాడు. శంకర్ ఇప్పటి వరకూ ట్రై చెయ్యని రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ ని ఈ సినిమాతో టచ్ చేయడం వలన ఈ సినిమాతో ఎలాంటి కొత్త పాయింట్ ని చెప్పనున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు