ప్రతీ ఒక్కరూ ప్రపంచ శాంతి కోరుకోవాలన్న రెహమాన్

ప్రతీ ఒక్కరూ ప్రపంచ శాంతి కోరుకోవాలన్న రెహమాన్

Published on Jan 29, 2015 1:17 AM IST

ar-rahaman
ఆస్కార్ అవార్డు గ్రహిత ఏ.ఆర్ రెహమాన్ ప్రతీ ఒక్కరినీ శాంతిని పాటిస్తూ సర్వమత సమానత్వాన్ని ఆచరించమని కోరాడు. ‘యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఇంటర్ ఫైత్ హార్మానీ వీక్’ లో భాగంగా రెహమాన్ తన ట్విట్టర్ ప్రొఫైల్ లో ‘మతాల మధ్య హింస పనికిరాదని, ఫిబ్రవరి మొదటి వారం అహింసని పాటిద్దామని’ తెలిపాడు. తన పిలుపుని లక్షలమంది అభిమానులు సమ్మతించడం ఆనందకరం

2011లో యునైటెడ్ నేషన్స్ సంస్థ ఈ స్వచ్చంద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంగీత సంబంధిత విషయాలేకాక ఇటువంటి సామాజిక శ్రేయస్సు కలిగిన అంశాలు సైతం రెహమాన్ ప్రస్తావించడం అభినందనీయం. ఈ మానవీయ మనస్సుని గుర్తించిన అమెరికా ప్రభుత్వం రెహమాన్ ని TB నివారణ/ అవగాహన కాయక్రమం కోసం ప్రచారకర్తగా ఎంపికచేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు