అరవింద సమేత మోషన్ పోస్టర్ విడుదల!

అరవింద సమేత మోషన్ పోస్టర్ విడుదల!

Published on May 20, 2018 11:56 AM IST

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల తాజా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నిన్న విడుదల కాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా నేడు ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్, ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

తమన్ మరొకసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసాడు. మోషన్ పోస్టర్ లో వినిపిస్తున్న మ్యూజిక్ తో ఈ సినిమా ఫుల్ ఆల్బమ్ ఫై అంచనాలు పెంచాడు .ఇప్పటికే ఈ సినిమాకి రెండు సూపర్ హిట్ సాంగ్స్ ని ఇచ్చిన తమన్ ఎన్టీఆర్ సినిమా కి పనిచేయడం ఇది ఐదో సారి గతంలో ఎన్టీఆర్ నటించిన ‘రామయ్య వస్తావయ్యా , బృందావనం, రభస, బాద్ షా’ చిత్రాలకి మ్యూజిక్ అందించారు.

ఇక త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించి సినిమా ఫై ఉన్నా అంచనాలను రెట్టింపు చేసాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది .

మోషన్ పోస్టర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు