రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘అర్జున్ రెడ్డి’ !

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘అర్జున్ రెడ్డి’ !

Published on Jul 28, 2017 4:25 PM IST


యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘అర్జున్ రెడ్డి’ అన్ని పనుల్ని పూర్తి చేసుకుంది. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్లతో సంచనలం క్రియేట్ చేసిన ఈ సినిమా కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని ఆగష్టు 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ట్రైలర్ చూసి సినిమా నుండి కొత్తదనాన్ని ఆశిస్తూ విడుదల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో కుతూహలం మొదలైంది.

మరోవైపు సినిమా బజ్ బాగాఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నాగానే జరిగింది. చిత్ర హక్కుల్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియాన్స్ సినిమాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ వంగ నిర్మిస్తుండగా షాలిని హీరోయిన్ గాను విపిఎస్ కళ్యాణ్, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌, కాంచ‌నలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు