జనాల్ని ప్రిపేర్ చేయడానికే లిప్ లాక్ సీన్స్ బయటికొదిలాన్న దర్శకుడు !

జనాల్ని ప్రిపేర్ చేయడానికే లిప్ లాక్ సీన్స్ బయటికొదిలాన్న దర్శకుడు !

Published on Aug 23, 2017 4:18 PM IST


రేపు సాయంత్రం ప్రీమియర్ల ద్వారా విడుదలకానున్న ‘అర్జున్ రెడ్డి’ చిత్రంపై యువత ఎంత క్రేజీగా ఉందో సోషల్ మీడియాలో చూస్తే అర్థమైపోతుంది. టీజర్, ట్రైలర్ ద్వారా మొదలైన ఈ సంచలనం లిప్ లాక్ పోస్టర్ల వివాదం, హీరో విజయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ తో తారా స్థాయికి చేరుకుంది. ఈ ముద్దు వివాదంపై స్పందించిన చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యూట్యూబ్ లో లిప్ లాక్ సీన్స్ రిలీజ్ చేయడంపై కూడా మాట్లాడారు.

లిప్ లాక్ పోస్టర్లో ఎలాంటి అశ్లీలత లేదన్న ఆయన రియాలిటీ కోసమే అలా చేశామని, అలాగే ప్రేక్షకుల్ని ముందుగా సినిమాలో ఇలాంటి కంటెంట్ ఉంటుంది అని ప్రిపేర్ చేయడానికే లిప్ లాక్ సీన్స్ ను బయటికొదిలాం. ముందు చెప్పకుండా థియేటర్లో లిప్ లాక్స్ చూపిస్తే డిస్టర్బ్ అయ్యే ఛాన్సుంది. అందుకే పోస్టర్లో కూడా లిప్ లాక్ ను ఉంచాం అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు