విక్రమ్ ని కాలిఫోర్నియా ఆహ్వానించిన ఆర్నాల్డ్

విక్రమ్ ని కాలిఫోర్నియా ఆహ్వానించిన ఆర్నాల్డ్

Published on Oct 21, 2014 8:20 AM IST

Vikram_arnold
హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ఇటీవలే ఇండియాకి వచ్చాడు. అదికూడా రెగ్యులర్ విజిటింగ్ కాకుండా సౌత్ ఇండియన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ – విక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఐ’ ఆడియో రిలీజ్ రావడంతో ఆర్నాల్డ్ ఇండియా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ‘ఐ’ ఆడియో రిలీజ్ అయ్యి చాలా రోజులయ్యింది ఇప్పుడెందుకు ఆర్నాల్డ్ గురించి చెబుతున్నాడా అని ఆలోచిస్తున్నారా.?

అక్కడికే వస్తున్నా.. మాకు అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ విక్రమ్ ని విజిటింగ్ కోసం కాలిఫోర్నియా రమ్మని ఆర్నాల్డ్ స్వయంగా ఆహ్వానించారట.. ఆర్నాల్డ్ ఆహ్వానాన్ని మన్నించి విక్రమ్ కాలిఫోర్నియా వెళ్లనున్నాడని సమాచారం. ‘ఐ’ ఆడియో రిలీజ్ కి వచ్చినప్పుడు విక్రమ్ తో ఎక్కువ సమయం గడపలేకపోవడం వలనే ఆర్నాల్డ్ విక్రమ్ ని కాలిఫోర్నియా రమ్మనట్లు విక్రమ్ సన్నిహితులు చెబుతున్నారు.

విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ‘ఐ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఎఆర్ రెహమాన్ కూడా రీ రికార్డింగ్ ని మొదలు పెట్టారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని నవంబర్ చివర్లో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు