ఆర్ట్ డైరెక్టర్ చిన్నాని విచారిస్తున్న సిట్ అధికారులు !

ఆర్ట్ డైరెక్టర్ చిన్నాని విచారిస్తున్న సిట్ అధికారులు !

Published on Jul 25, 2017 12:30 PM IST


టాలీవుడ్లోని డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో ప్రత్యేక విచారణ బృందం విచారణను కొనసాగిస్తోంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, శ్యామ్ కె నాయుడు వంటి ప్రముఖుల్ని విచారించిన అధికారులు కొద్దిసేపటి క్రితమే చిన్నా విచారణను ప్రారంభించారు. నిన్నటి వరకు జరిగిన విచారణ ద్వారా కొన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్న కొందరు పరిశ్రమకు చెందిన వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.

నిన్న కాజల్, లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నా వంటి స్టార హీరోయిన్లకు మేనేజర్ గా వ్యవరించిన రోనీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని ఇంటి నుండి గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విచారణ జాబితాలో ఉన్నా నటి ఛార్మి సిట్ ఎంక్వైరీ సరిగా లేదని, బలవంతంగా శాంపిల్స్ సేకరిస్తున్నారని పిటిషన్ వేయగా అధికారులు అలాంటివేమీ లేవని విచారణ మొత్తాన్ని రికార్డ్ చేస్తున్నామని సమాధానమిచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు