పవర్ ఫుల్ విలన్ పాత్రలో ‘బొంబాయి’ హీరో..!

పవర్ ఫుల్ విలన్ పాత్రలో ‘బొంబాయి’ హీరో..!

Published on Jul 30, 2014 2:34 PM IST

aravand-swamy

‘రోజా’, ‘బొంబాయి’ ‘దళపతి’… మణిరత్నం సినిమాలతో తెలుగు, తమిళ భాషలలో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు అరవింద్ స్వామి. తర్వాత సినిమాలకు దూరంగా వెళ్ళిపోయారు. మళ్లీ తిరిగి గత ఏడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కడలి’ సినిమా ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చారు. ‘కడలి’లో పాజిటివ్ రోల్ లో కనిపించారు.

తాజాగా ఒక తమిళ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించడానికి అంగీకరించారు. జయం రవి, నయనతార జంటగా నటిస్తున్న ‘తాని ఒరువన్’ సినిమాలో అరవింద్ స్వామి విలన్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నయనతార పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు