షారుక్ నెక్స్ట్ సినిమా దర్శకుడు మనోడే

షారుక్ నెక్స్ట్ సినిమా దర్శకుడు మనోడే

Published on Oct 15, 2019 10:09 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన గత చిత్రాలు ‘జీరో, ట్యూబ్ లైట్, రాఈస్, జబ్ హ్యారీ మెట్ సెజల్’ లాంటి సినిమాలు ఊహించని రీతిలో వరుసగా విఫలమయ్యాయి. దీంతో ఆలోచనలో పడిన అయన లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ విరామంలో ఇకపై రొటీన్ ఫార్ములాని ఫాలో అయితే లాభం లేదనుకున్న ఆయన హిందీ ప్రేక్షకులు సైతం విపరీతంగా ఆదరిస్తున్న దక్షిణాది మాస్, యాక్షన్ ఫార్ములా మీద దృష్టి పెట్టారు.

అంతేకాదు ఈసారి దక్షిణాది దర్శకుడితోనే పనిచేయాలని నిర్ణయించుకున్న ఆయన కొందరి పేర్లని పరిశీలించి చివరికి అట్లీని ఎంచుకున్నారట. ఇద్దరి మధ్య చర్చలు జరిగి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయిందట. అట్లీ ప్రజెంట్ ‘బిగిల్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అవి పూర్తైన వెంటనే డిసెంబర్ నుండి షారుక్ సినిమా పనులు స్టార్ట్ చేస్తారట. మొత్తానికి అట్లీకి హిందీ పరిశ్రమలో తన మార్క్ చూపడానికి మంచి అవకాశమే దొరికింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు