త్వరలోనే తెలుగు సినిమా చేస్తానంటున్న అట్లీ !


యువ దర్శకుడు అట్లీ చేసింది మూడు సినిమాలే.. అందులో రెండు హీరో విజయ్ తో ఉండటం వలన ఈయన స్టార్ దర్శకుడైపోయారు. ప్రస్తుతం విజయ్ తో ఈయన చేసిన రెండవ చిత్రం ‘మెర్సల్’ తమిళనాట భారీ సూపర్ హిట్ దిశగా సాగుతోంది. ఈయన చేసిన ‘రాజు రాణి, పోలీసోడు’ వంటి సినిమాలు ఇప్పటికే తెలుగులో విడుదలై ఆయనకు మంచి గుర్తింపునివ్వగా ‘మెర్సల్’ కూడా రేపు ‘అదిరింది’ పేరుతో రిలీజ్ కానుంది.

మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు ఏ పరిశ్రమలోనైనా నిలబడగలడన్న వాస్తవాన్ని గట్టిగా నమ్మే అట్లీ త్వరలోనే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటున్నారు. ఇదివరకే మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో చర్చలు చేశానన్న అట్లీ అన్నీ కుదిరితే త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని, తనకు చిరు, పవన్, మహేష్, బన్నీ, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని అన్నారు. ఈ మాటలను చూస్తే అట్లీ తెలుగు సినిమా అంటూ చేస్తే అది ఈ జాబితాలోని హీరోల్లో ఎవరో ఒకరితో చేసేలా కనిపిస్తున్నారు.

 

Like us on Facebook