ఇంటర్వ్యూ : నాని – నాకున్న పెద్ద బ్యాక్ గ్రౌండ్ ప్రేక్షకులే !

ఇంటర్వ్యూ : నాని – నాకున్న పెద్ద బ్యాక్ గ్రౌండ్ ప్రేక్షకులే !

Published on Dec 19, 2017 12:28 PM IST

హీరో నాని తాజా చిత్రం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ గురువారం రోజున రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సినిమా గురించిన పలు విషయాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) మీరు కథల్ని ఎలా ఎంచుకుంటారు ?
జ) ఏ కథైనా నాకు నచ్చాలి. అలా నచ్చితే వెంటనే ఓకే చేస్తాను. ఒక కామన్ ప్రేక్షకుడిలా కథను వింటాను. ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయగలమా లేదా చేస్తాను. అలా ఎంజాయ్ చేయగలిగితే ఆ కథ చేస్తాను.

ప్ర) మీకు వరుస హిట్లున్నాయి కదా.. ఈ రిలీజ్ పట్ల టెంక్షన్ ఏమైనా ఉందా ?
జ) ఉంది. నాకు ప్రతి సినిమా విడుదలప్పుడు టెంక్షన్ గానే ఉంటుంది. నన్ను నమ్మి నిర్మాతలు ఇంత డబ్బు పెట్టారు. రిజల్ట్ ఎలా ఉంటుందో అని కంగారుగా ఉంటుంది.

ప్ర) ఈ సినిమాలో యాక్షన్ మోతాదు ఎక్కువగా ఉన్నట్టుంది ?
జ) అలాంటిదేం లేదు. సినిమాలో యాక్షన్ మూడ్ ఉంటుంది తప్ప పెద్ద పెద్ద ఫైట్స్ తో కూడిన యాక్షన్ ఉండదు.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) చాలా నార్మల్ గానే ఉంటుంది. మనం రోజు చూసే మిడిల్ క్లాస్ అబ్బాయిల జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్, టెంక్షన్స్ ఉంటాయో అన్నీ నా పాత్రలో ఉంటాయి. హీరోగా మారాల్సిన పరిస్థితుల్లో హీరో అవుతాడు.

ప్ర) మీరు బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎదిగారు కదా. దాని పట్ల మీ ఫీలింగ్ ?
జ) నాకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవచ్చు. కానీ ప్రేక్షకుల్ సపోర్ట్ ఉంది. అదే నన్ను ముందుకు నడుపుతుంది. దాన్ని మించిన సపోర్ట్ మరేదీ ఉండదు. ఒకరకంగా బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వలన ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాను. అది ఒకరకంగా నా అదృష్టం.

ప్ర) సాయి పల్లవి ఏ సినిమాకి ఎంతలా హెల్ప్ అవుతుంది ?
జ) సాయి పల్లవి కనిపించే ప్రతి సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఆమె ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది.

ప్ర) భూమికగారితో వర్క్ ఎలా ఉంది ?
జ) ఆమెలాంటి మంచి వ్యక్తిని నేనిప్పటి వరకు కలవలేదు. తక్కువ సమయంలోనే మా కుటుంబంలోని వ్యక్తిగా మారిపోయారు. వాళ్ళ అబ్బాయిని ఏం కొన్నా మా అబ్బాయి అర్జున్ కి కూడా అవే కొనేవారు. నాకు నిజమైన వదినలా అయిపోయారు.

ప్ర) షూటింగ్ సమయంలో మీకు, సాయి పల్లవికి మధ్య క్లాషెస్ వచ్చాయని విన్నాం ?
జ) అలాంటిదేం లేదు. చాలా సరదాగా కలిసి పనిచేశాం. అవన్నీ గాసిప్స్ మాత్రమే. నేను వర్క్ చేసిన బెస్ట్ కో స్టార్స్ లో ఆమె కూడా ఒకరు.

ప్ర) సినిమా కథ ఎలా ఉండబోతోంది ?
జ) ట్రైలర్ లో చూపించిందే సినిమా కథ. ఆ కథను కొత్తగా, ఆకట్టుకునే విధంగా ఎలా చూపించాం అనేదే సినిమా.

ప్ర) ఈ సినిమాని కథ నచ్చి చేశారా, లేకపోతె దిల్ రాజుగారి కోసం చేశారా ?
జ) ప్రత్యేకంగా ఎవరి కోసమో ఈ సినిమా చేయలేదు. నాకు కథ నచ్చింది కాబట్టి చేశాను.

ప్ర) మొదటి సినిమా తర్వాత వేణుశ్రీరామ్ కు చాలా గ్యాప్ వచ్చింది కదా ఆయనతో సినిమా అంటే రిస్క్ అనిపించలేదా ?
జ) లేదు. నేనసలు ఆ విషయాలు పట్టించుకోను. ఆయన కథ చెప్పేప్పుడు నచ్చిందా లేదా అనేదే చూశాను. నచ్చిని కాబట్టి చేశాను.

ప్ర) నాగార్జునగారితో మల్టీ స్టారర్ ఎంతవరకు వచ్చింది ?
జ) కథ నాకు, నాగార్జునగారికి నచ్చింది. ఇంకొక ఫైనల్ సిట్టింగ్ ఉంది. దాంతో ఫైనల్ డెసిషన్ వచ్చేస్తుంది. అప్పుడు నేనే విషయం ఏమిటనేది అఫీషియల్ గా ప్రకటిస్తాను.

ప్ర) ‘అ’ సినిమాను మీరే నిర్మించడానికి కారణం ?
జ) బహుశా అలాంటి కథను ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూసి ఉండం. డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు కొత్తవాళ్లతో చేస్తాను అన్నాడు. కానీ ఇలాంటి సబ్జెక్ట్ జనాల్లోకి వెళ్లాలంటే మంచి బడ్జెట్, స్టార్స్ ఉండాలని నేనే నిర్మిస్తానని చెప్పాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు